విశాఖ ఉక్కు పై ప్రభుత్వం నోరు విప్పాలి: పోతిన మహేష్

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ.
  • మెప్పు కోసమే అంబటి రాంబాబు కులాన్ని దూషిస్తున్నారు
  • విమర్శలు అపి స్టీల్ ప్లాంట్ పై అంబటి రాంబాబు స్పందించాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

విశాఖ ఉక్కుపై ప్రభుత్వం నోరు విప్పాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అన్నారు

సోమవారం జనసేనపార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాడతారా లేక పారిపోతారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని, ఢిల్లీలో రగ్గులు కప్పుకొని పార్లమెంట్ లో పోరాడకుండా దాక్కుంటారా..? అని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాలకు వీళ్లు మొక్కుబడిగా వెళ్తున్నారని, ప్రజా సమస్యలు, ప్రజల భావోద్వేగాలతో పని లేదన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం పార్లమెంటులో నటిస్తారని, ప్రతి సెషన్ లో ప్రతిసారి ప్రధాని మోదీ దగ్గరకు విజయసాయి రెడ్డి వెళ్లి ఒక ఫోటో తీసుకొని వస్తారే తప్ప రాష్ట్రం గురించి మాట్లాడరని, వెళ్లి ఏమి అడుగుతారో అందరికీ తెలుసని, ఏపీ ప్రజలను మోసం చేసేలా హామీలు ఇచ్చి వైసీపీ గెలిచిందని, 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం విశాఖ ఉక్కు అని అన్నారు.

పవన్ కళ్యాణ్ కి రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ అని తెలిపారు. మోసం, మాయ, దగా తెలియవు పోరాడటం మాత్రమే తెలుసని అన్నారు. లెక్కలు వేసికొని పోరాడతున్నట్లు నటించడం జగన్ కి మాత్రమే చెల్లిందన్నారు. అఖిల పక్షం వేసే దమ్ముందా..?, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి పోరాడడం అంటే పారిపోతున్నారని అన్నారు.

అంబటి రాంబాబు అనే ఒక ఎమ్మెల్యే జగన్ మెప్పు కోసం కులాన్ని దూషించారని, అతనొక కులద్రోహి అని, ప్రపంచంలో ఎవరు అతనిలాగా ఫోన్లో మాట్లాడలేరని, అలాంటి సంస్కార హీనులు కూడా తమ పార్టీ అధ్యక్షులు గురించి మాట్లాడుతున్నారని, మంత్రి వర్గ విస్తరణలో స్థానం ఉంటుందని ఆశ పడి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని అన్నారు. పవన్ పై విమర్శలు అపి స్టీల్ ప్లాంట్ పై స్పందించాలని, మీ హావభావాలు చూసిన వారందరూ మీరు నాయకుడిగా కన్నా నాటక రంగంలో బాగా రాణిస్తారని, మీ సత్తెనపల్లి నియోజక వర్గంలో ఈ రెండున్నర సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కోరారు.

-హోం మంత్రి సుచరిత స్పందించాలని మహేష్ డిమాండ్ చేశారు.

  • హోం శాఖ మంత్రి సుచరిత గారు మనస్సాక్షితో స్పందించాలి
  • కేవలం ప్రచారం కోసం దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు
  • అధికారమంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేలయించడం వాస్తవం కాదా?

హోం శాఖ మంత్రి సుచరిత మనస్సాక్షితో స్పందించాలని కోరారు. కేవలం ప్రచారం కోసం దళిత మహిళకు హోంశాఖ కేటాయించి హోం శాఖకు సంబంధించిన అధికారమంతా సజ్జల రామకృష్ణారెడ్డి చెలాయించడం వాస్తవం కాదా ఆని ప్రశ్నల వర్షం కురిపించారు.

హోంగార్డును కూడా నియమించే అధికారం లేని హోంశాఖకు సుచరితని మంత్రిని చేసిందీ కేవలం ప్రచారం కోసం మాత్రమేనని, ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా గుంటూరు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం వాస్తవం కాదా అని అడిగారు. ఆ కార్యక్రమాలకు మీరు హాజరు కాకపోవడం వాస్తవం కాదా అని, మీ మనస్సాక్షితో ఒకసారి సీఎంని ప్రశ్నించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయొద్దని, రాజధాని అమరావతిగానే ఉండాలని, రైతులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించాలని పవన్ కళ్యాణ్ పోరాడడం… ఉద్యమించడం… వారు చేస్తున్న తప్పా అని అడిగారు.