దోసలుడికి గ్రామంలో స్మశాన వాటిక సమస్యను పరిష్కరించండి..

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు మండలం, దోసలుడికి గ్రామంలో ప్రధాన సమస్య అయిన స్మశాన వాటిక స్థలం కేటాయింపు కొరకు చొరవ తీసుకోవాలని శనివారం గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ గుంతకల్లు ఆర్.డి.ఓ ను కలిసి వినతిపత్రం అందించారు. గుంతకల్లు మండల పరిధిలోని దోసలుడికి గ్రామ పంచాయతీ నందు సుమారు 2,500కు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ గ్రామంలో మనుషుల మరణాంతరం అంతక్రియలకు ఉన్న చోటు కేవలం 3 సెంట్ల లోపే, ఇది అత్యంత బాధకరమైన విషయం. దీనివలన దోసలుడికి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాలు చేయటానికి స్థానికులు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రయోజనం కలగలేదు, గ్రామ ప్రజలు, పాలకులకు ఎన్ని విన్నపాలు విన్నపించుకున్నా, ఫలితం మాత్రం శూన్యం. ఈ ధారుణమైన సమస్య జనసేన పార్టీ దృష్టికి రాగా వెంటనే వెళ్ళి పరిశీలించగా స్మశాన వాటిక సమస్య వాస్తవమేనని నిర్ధారించి శనివారం స్మశానవాటిక సమస్యను మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కావున మీరు దోసలుడికి గ్రామ ప్రజల యొక్క స్మశానవాటిక సమస్యను పరిగణలోకి తీసుకొని, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు అమీన్ సోహైల్, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్.ఎల్.బి), గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా గారు, యువ నాయకులు అరవింద్ కుమార్, ఆర్.సి సురేష్ కుమార్ (ఎల్.ఎల్.బి), ఈశ్వర్, చిన్న, సర్దార్ బాషా, వీరేష్, రంగస్వామి, ఇంద్ర, నాగరాజు, పులెంద్ర, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.