బాధిత కుటుంబానికి అండగా నిలచిన జనసేన నేత జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన దండు రమణ నిర్మాణంలో ఉన్న భవనంపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారి సిమెంటు రోడ్డుపై పడి దండు రమణ తీవ్రగాయాలుతో మరణించారు. దండు రమణ మరణవార్తను గొల్లప్రోలు నగర జనసైనికులు ద్వారా తెలుసుకొన్న పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు శనివారం గొల్లప్రోలులోని దండు రమణ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను, దండు రమణ తండ్రి దండు పుల్లయ్యను పరామర్శించారు. దండు రమణ రోజువారీ భవననిర్మాణ కార్మికుడు, బీదకుటుంబంనకు చెందినవ్యక్తి. దండు రమణకు భార్య, తల్లిదండ్రులు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దండురమణ కుటుంబానికి ప్రదాన సంపాదనపరుడు కావడంతో వీరు ఆర్దికంగా చాలా ఇబ్బందిపడుచున్నారు. విషయం తెలుసుకున్న జ్యోతుల శ్రీనివాసు నగదు సహాయం అందజేసి 25 కేజీల బియ్యం, కిరణా సామాన్లులను అందించారు. దండు రమణ రెండవ కుమార్తె ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నారు. ఆమెకు భవిష్యత్తులో చదువుకు తగు సహాయసకారాలు అందిస్తానని జ్యోతుల శ్రీనివాసు బరొసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వినుకొండ అమ్మాజీ, గొల్లప్రోలు మండలం జనసేన ఉపాధ్యక్షులు గొల్లపల్లి గంగ, దుర్గాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వెలుగు లక్ష్మణ్, కొసిరెడ్డి నాగేశ్వరరావు, సూర్నీడి సురేష్, జ్యోతుల సీతారాంబాబు, పొలంత్రిమూర్తులు, మణుగుల అర్జున్, మేడిపోయిన హరికృష్ణ తదితరులు ఉన్నారు.