పవన్ కళ్యాణ్ ఆలోచన మరియు చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వమే వస్తుంది: మర్రాపు సురేష్

గజపతినగరం, జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ గజపతినగరం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ ఎక్కడ చూసినా సమస్యలే, ఎవరిని కదిలించిన కన్నీరే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయింది, కోట్లు కొల్లగొట్టిన ముఖ్యమంత్రి ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఇచ్చాడా? ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడం హాస్యస్పదం, ఇంకో ఐదు నెలలే, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు, పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వమే వస్తుంది, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అపార నష్టం, సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలు, వ్యవసాయ రంగంపై వైసీపీ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం. ఇన్ఫోసిస్ కార్యాలయం మీరే తీసుకొచ్చినట్లు బిల్డప్ ఎందుకు? ఆ సంస్థ తమ ఉత్తరాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసం కార్యాలయం ఏర్పాటు చేసింది. బొత్స టోఫెల్ టోపీ నిజమేనండీ, టోఫెల్ ఒప్పందం సీఎం కార్యాలయం పరిధిలోనే సాగింది. సంబంధిత మంత్రి బొత్సకు తెలియకుండా ఒప్పందం జరిగి ఉండొచ్చు. ఆయన 54 పేజీల ఒప్పందాన్ని చదివి వస్తే చర్చకు మేం సిద్ధం, ప్రజాధనం లూటీ విషయంలో వైసీపీ రూటే సపరేటు, జనసేన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతుంది. వైసీపీ ఓ తాడు బొంగరం లేని పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడెవరో తెలీదు క్రియాశీలక సభ్యులూ లేరు, రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకు కార్యకర్తలు నాయకులు అందరు కలిసి పని చేయాలి అని అన్నారు. 3వ విడత పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం పై కార్యచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, కలిగి పండు, ఆదినారాయణ, మహేష్ శ్రీను, గంట్యాడ మండలం బాలు యాదవ్, గణేష్, హేమసుందర్, లక్ష్మణ, చరణ్, అనిల్, జనసైనికులు పాల్గొన్నారు.