ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలవాలి: యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట: ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి అన్నదాతను కుదేలు చేస్తోంది.. మిచోంగ్ తుఫాను వల్ల రాజంపేట నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం విధిగా అన్నదాతకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున జనసేన నియోజకవర్గం నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా ఉద్యాన పంటలకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని జనసేన తరపున డిమాండ్ చేశారు. తుఫాను వల్ల ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది.
చేతికొచ్చిన వందలాది ఎకరాల అరటి పంట నేలమట్టమైంది. రాజంపేట మండలంలోని హస్తవరం, చెర్లోపల్లి, అకేపాడు ప్రాంతాల్లో ఎక్కువ అరటిపంట నేలమట్టమైంది. అంతేకాకుండా ఒంటిమిట్ట, సిద్దవటం, సుండుపల్లి, వీరబల్లి ప్రాంతంలోని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వనికి విన్నవిస్తున్న.. ఉద్యానపంటలకు ఇన్సూరెన్స్ కల్పించకపోతే భవిషత్తులో రైతుల తరపున పోరాటానికి కూడా సిద్దమని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా జిల్లా యంత్రాంగం పంట నష్టాన్ని నిస్పాక్షికంగా అంచనా వేసి.. ప్రభుత్వం నుండి రైతులకు త్వరిత గతిన పరిహారం అందేలా చూడాలని జనసేన తరపున శ్రీనివాస రాజు డిమాండ్ చేసారు.