విద్యా దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు మరియు ప్రైవేటు, కార్పెట్ స్కూల్లో విద్యా దోపిడీని అరికట్టాలని గుంతకల్ ఆర్డీవో కి జనసేన పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూలు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు, కరోనా విపత్కర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్య ప్రజల నడ్డివిరిచే విధంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికలు ఉన్నా ఆ నిబంధనలు పక్కనపెట్టి తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా వారి విద్యాసంస్థల్లో నే పాఠ్యపుస్తకాలను కొనాలనే నిబంధనలను పెట్టి అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. విద్యాశాఖ నుండి ప్రతి సంవత్సరము 10% ఫీజులు మాత్రమే పెంచాలని ఆదేశాలున్న వాటిని పెడచెవిన పెట్టి కార్పొరేటర్ స్కూలు 20 నుండి 30% ఫీజులు వసూలు చేయడం, విద్యా హక్కు చట్టం కింద ప్రతి సంవత్సరము కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలల్లో 25% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని నిబంధనలు ఉన్నా జిల్లా మరియు రాష్ట్రంలో పేద విద్యార్థులకు సరిగా ఆఫలాలు అందట్లేదు కావున అన్ని స్కూళ్లలో అడ్మిషన్లు మొదలవుతున్న దృశ్య పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై భారంపడకుండా వెంటనే ప్రైవేటు, కార్పోరేటు స్కూల్స్ లో ఆర్థిక దోపిడి నియంత్రణకై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున విన్నవించామని, ప్రభుత్వం లేదా అధికారులు చర్యలు తీసుకొని పక్షాన, ప్రత్యక్షంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురుబ పురుషోత్తం జిల్లా కార్యక్రమాలు నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్. కృష్ణ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, దోసురుడికి మల్లికార్జున, అఖిల్ రాయల్ జనసైనికులు ముత్తు, అమర్, అనిల్ కుమార్, కసాపురం రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.