పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి: జనసేన డిమాండ్

రంపచోడవరం నియోజవర్గం: చింతూరు మండలం, నిమ్మలగూడెం గ్రామస్తులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు సంబంధించిన గతంలో అధికారులు సర్వేలు నిర్వహించి, పట్టాదారు పాస్ పుస్తకాలు కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి ఇవ్వలేదు తక్షణమే ప్రభుత్వ వారు ఈ సమస్యపై చొరవ తీసుకొని విచారణ జరిపి గ్రామంలో గ్రామ సభ జరిపి గ్రామస్తులకి న్యాయం చేయాలని అధికారుల్ని కోరడం జరిగింది. జనసేన పార్టీ చింతూరు మండలం అధ్యక్షులు మడివి రాజు ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏపీవో సుజాతకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు మడివి రాజుగారు అలాగే గ్రామస్తులు మడకం రాజయ్య, పండ వెంకటేశ్వర్లు, పాయం రమణయ్య, మడివి ముత్తయ్య, సవలం అశోక్ కుమార్, పండ సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.