ఘనంగా ఉత్తాడ రామరాజు పుట్టినరోజు వేడుకలు

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలంలోని మండల సీనియర్ నాయకులు మరియు మెగా ఫ్యామిలీ విధేయులు, వీరాభిమానులు, మాజీ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉత్తాడ రామరాజు పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి నియోజకవర్గం స్థాయి జనసైనికుల ఆధ్వర్యంలో కశింకోట నందు గల వారి స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతూ మెగా అభిమానులందరూ ఏకతాటి మీదకి వచ్చి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని, అభిమాని స్థాయినుండి కార్యకర్త స్థాయికి చేరుకోవాలని కోరుతూ, శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మరో పక్కన అదే మండలంలోని జమాదులపాలెం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కరణం శివకుమార్ పుట్టినరోజు వేడుకలు మండల, గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగా ఈశ్వర్, పావాడ కామరాజు, మద్దాల రాంజీ, గొంతిన ఈశ్వరరావు, కలగా శ్రీనివాసరావు, కర్రి లోవరాజు, కర్రి గోవింద్ (పిఆర్పి), కాయల బాబురావు, గండిబోయిన కాశీరావు, కడిమి నాగ చిరంజీవి, గూడెపు మణికంఠ, అఖిల్ శ్రీను, గనిరెడ్డి దినేష్, మండే శ్రీను, కలగా గణేష్, కలిగెట్ల వీర, బలిజ వినయ్, మండపాక త్రినాధ్, విశ్వేశ్వరరావు, గెంజి హేమంత్, పడాల యస్వంత్, పావాడ కార్తీక్, సేనాపతి శివ, బొద్దపు శివ, వీర మహిళ శనివాడ లక్ష్మి, గుర్రాల సత్యారావు, ఉమా మహేష్, గూడుపు చిన్నారావు, శివ శంకర్, మడక అప్పారావు, జోగాడ సతీష్, పచ్చికూర శేఖర్, ఊడి నూకరాజు, మజ్జి బాబ్జి, బుదిరెడ్డి బాబు, కుమార్, కర్రి సత్తిబాబు, కోన బాబురావు, చెరకాం శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *