చింతపల్లిలో ఘనంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

అల్లూరి జిల్లా, చింతపల్లి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంలో జనసేన పార్టీ అరకు పార్లమెంటు పాడేరు ఇంచార్జి డా.వంపూరు గంగులయ్యా ఆదేశాల మేరకు జనసేన పార్టీ మండల నాయకులు వంతల బుజ్జిబాబు, గాజుల శ్రీను, కిమ్ముడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చింతపల్లి మండల హెడ్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంతల బుజ్జిబాబు మాట్లాడుతూ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజం మారాలని కోరుకుని కుల వ్యవస్థ పోవాలని, అంటరానితనం పోవాలని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వంగా సౌబ్రాతృత్వంతో సమాజంలో ఐక్యంగా నిలవాలని చెప్పారు. సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో వృత్తులను ఎన్నుకునే హక్కు అన్ని వర్గాల ప్రజలకు ఉండాలని అలా జరగని పక్షంలో బానిసత్వమే రాజ్యమేలుతోందని అసమానతలను తగ్గించాలని పీడిత వర్గాలకు రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించాలని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికివ్వకేదు, ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులు అవుతారో అమ్ముకుని బానిసలు అవుతారో అది వారి చేతుల్లోనే ఉంది. అని డా.బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. అందుకు మనం మన హక్కులు కోసం, మన స్వేచ్ఛ కోసం, మన భవిష్యత్తు కోసం పోరాడాలి. కులం వర్గం బేధాలు లేకుండా మన సమాజంలో పరిపూర్ణంగా మెలిగేలా ఉండాలని వంతల బుజ్జిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చింతపల్లి మండల నాయకులు పి నాగేశ్వరరావు, సి.హెచ్ దారాబాబు, సి.హెచ్ రవి, ఎమ్ రామారావు, జీ బాలకృష్ణ, వి ఈశ్వరరావు, జి బాలరాజు, జి వినయ్, వి సోమరాజు, కె దావీదు, కె జాన్ పాల్గొన్నారు.