దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

  • జర్నలిస్టుల సేవలు మరువలేనివి
  • ప్రభుత్వ – ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులు
  • డాక్టర్ కందుల ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు
  • పలువురు జర్నలిస్టులకు సత్కారాలు
  • ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వేడుకలు

వైజాగ్ సౌత్: ప్రతిక్షణం సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల సేవలు మరువలేనివని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. బుధవారం జర్నలిస్ట్ డే వేడుకలను అల్లిపురం డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతుండే వ్యక్తులు జర్నలిస్టులని, జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జర్నలిస్టు ల కృషి మరువ లేనిదని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి, పరిష్కరించే ప్రత్యేక కథనాలు వ్రాస్తు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా జర్నలిస్ట్ లు నిలుస్తున్నారన్నారు. ఈ సందర్బంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు
తెలిపారు. వార్త లు వ్రాయడం వృత్తి రీత్యా మీ బాధ్యత అయినప్పటికీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు కీలక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిరణ్ ప్రసాద్, నాగలక్ష్మి, నందితా రావు, ఉసిరికల యజ్ఞేశ్వరి, లుక్స్ గణేష్, ప్రణీత్, గాజుల శ్రీను, అనిల్, నాగేంద్ర, సతీష్, శ్రీను, ప్రసాద్, జయ, అంబేద్కర్, కుమారి, వరలక్ష్మి, ఝాన్సీ, కోమలి, శ్రీదేవి, కోదండమ్మ, దుర్గా, లలిత, వాణి, పద్మ, కందుల నలిని దేవి, జనసేన యువ నాయకులు కందుల బద్రీనాథ్, కందుల కేదారినాథ్ తదితరులు పాల్గొన్నారు.