తవణంపల్లిలో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభం

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ అలియాస్ శివ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిధిగా మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ మరియు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మెట్టుపల్లిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పార్టీకి తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, వీర మహిళా నాయకురాలు వనజ, జిల్లా కార్యదర్శి భాను, మండల అధ్యక్షులు మనోహర్, కుమార్, పురుషోత్తం ఉపాధ్యక్షులు బాలు, పూర్ణ ప్రధాన కార్యదర్శిల ఉదయ్, అనిల్, వాసు, తులసిబాబు, వీర మహిళా నాయకురాలు రమాదేవి, పుష్ప, సీనియర్ నాయకులు గోపి, మోహన్, యోగరాజు, వెంకటేశు, లోచన్ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.