గండ్రోతు దుర్గాదేవికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

*సమాజ సేవకురాలు గండ్రోతు దుర్గాదేవి జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షల వెల్లువ

*దుర్గాదేవి చేస్తున్న సేవలకు పలువురి అభినందనలు

కోనసీమ జిల్లా, రావులపాలెం. సమాజ కోసం ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తున్న ఎందరో మహిళామణుల్లో సమాజ సేవకురాలు దుర్గాదేవి ఒకరు. కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని.. రావులపాలెం మండలం పరిధిలోని.. ఈతకోట గ్రామానికి చెందిన గండ్రోతు దుర్గాదేవి అను నిత్యం ప్రజాసేవలో కొనసాగుతుంది. మంగళవారం నాడు ఆమె జన్మదినం పురస్కరించుకొని పలువురు ఫోన్లు.. వాట్సఫ్.. పేస్ బుక్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె చేస్తున్న సేవలను గ్రామస్తులు, పెద్దలు, రాజకీయ నాయకులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలతో తమ ఆశీస్సులను అందజేశారు. నవ సమాజన స్థాపన కోసం ముందు ఉండే యువతీ దుర్గాదేవి మంచి మనసుతో మానవత్వంతో ప్రతీ క్షణం తన ఆలోచనలతో ధైర్యంగా సమాజం కోసమే పరితపిస్తున్నారు. ఏ విధంగా చూసినా ఆమె ఆలోచన అంతా సేవా కోణమే.. అత్యంత పరిస్థితుల్లో ఎవరికైన బ్లెడ్ కావాల్సిన సమయంలో.. అందరి సహాయ సహకారాలతో తొందరగా దాతలను ఏర్పాట్లు చేయడం ఆమెకున్న మంచి గుణం. నిత్యం ప్రజా సేవా కార్యక్రమాల్ని కొనసాగించే దుర్గాదేవి ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడమే కాకుండా.. ఆకలి అంటూ వచ్చే వారికి ఆపన్న హస్తంతో ఆహార పదార్ధాలను అందజేయడం ఆమెకున్న మానవత్వానికి నిదర్శనం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె కష్టపడి ఉద్యోగం బాధ్యతలను నిర్వహిస్తూ.. ఉన్నంతలో ప్రజా సేవకు పాటుపడటం ఆమె నైజం.