జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.