యూఏఈ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పుజారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం యూఏఈ జనసేన కార్యాలయంలో యూఏఈ జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూఏఈ జనసేన ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు జనసైనికుల మద్య కేకును కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి యూఏఈ జనసేన నుండి తమ సంపూర్ణ సహకారమందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఏఈ జనసేన అధ్యక్షులు పెనుమాల జాన్ బాబు, యూఏఈ జనసేన ఉపాధ్యక్షులు కొమ్ముల వేను, ట్రెజరర్లు రవికుమార్ శింగిరి, చంద్రశేఖర్ మొగళ్ళ, యూఏఈ జనసేన సభ్యులు సురేష్ గంధం, మెయిన అప్పారావు, రావి నాగలీలా సత్యనారాయణ, యుగంధర్ ఉప్పాడ, తరమాటి శ్రీనివాసరావు, గోపాలకృష్ణ మండెల, భాస్కర్ మండెల, సుధాకర్ కూనిశెట్టి, వీరహనుమాన్ రెడ్డిచర్ల, సురేష్ కుమార్ పెదపాటి, ప్రసాద్ ఎం.ఎన్.వి, ప్రదీప్ పరిమి, కిషోర్, ధర్మ, కుటుంబరావు కెవి, రవికుమార్ గండం, వేణు మదగల, గిరి ప్రసాద్, అమరదీప్ జి, ప్రదీప్ రాజ్ జి, సతీష్ రెడ్డి, జగదీష్ బెల్లంకొండ, రవీంద్ర, నాగసూర్య మండెల, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.