వృద్ధురాలికి ట్రీట్మెంట్ చేయించిన గాజువాక జనసేన

గాజువాక నియోజవర్గం, జనసేనాని కొణెదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని శ్రీమతి శీతిన పార్వతమ్మ గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు చెవులు పనిచేయక ఎన్నో ఇబ్బందులు పడుతున్నందున కొత్తూరు జనసేన నాయకులు నీలం రమేష్ బాబు, సీతిన నాగరాజు మరియు దామురోతు శేషు, జనసైనికులు గుర్తించి అమెకు ట్రీట్మెంట్ ఇప్పించి మీకు మేము ఉన్నాము అని నిరూపించారు. ఆమె చెవులకి ఇయర్ మిషన్స్ కోసం రూపాయలు 10,000/- (పది వేల రూపాయలు) జనసేన పార్టీ జీవీఎంసీ 85 వార్డ్ తరుఫున ఆర్థిక సహయం అందచేసిన జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.