చిల్లపల్లి ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది.