ఘనంగా జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో జనసేన పార్టీ నగర కార్యదర్శి గుండు రాము ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, నగర కమిటీ, సభ్యులు వీర మహిళలు, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.