డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన అడబాల తాతకాపు

మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామపంచాయతీలో మరియు సెంటర్లో అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ మరియు మామిడికుదురు మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వారు, పంచాయితీ ఉపసర్పంచ్, ఎంపీటీసీ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.