కొత్తగుంట స్మశానానికి గ్రావెల్ తోలండి మహాప్రభో అంటే పట్టించుకున్న పరిస్థితులు లేవు: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామపంచాయతీలోని ఐదు కులాలవారు వినియోగించుకునే కొత్తగుంట స్మశానాన్ని మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నో ఏళ్ల నుంచి కొత్తగుంట స్మశానాన్ని గ్రామంలోని ఐదు కులాలవారు మంగలి, కుమ్మరి, చాకలి, యాదవ, బలిజ వీరు వినియోగించుకుంటున్నారు. వర్షాకాలం నీళ్లతో నిండిపోతే శవాన్ని పూడ్చుకునే దానికి ఎంతో ఇబ్బంది నీళ్లలోనే పూడ్చి పెట్టుకునే పరిస్థితి. ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ కి స్పందనలో వినతి పత్రాలు ఇచ్చినా గాని ఫలితం లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో స్మశానానికి గ్రావెల్ తోలే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కోట్ల రూపాయల విలువ చేసే గ్రామాలను మాత్రం వాళ్ళ గానుగులు నింపుకునే దానికి దోచుకోబోతున్నారు గాని అయ్యా మాకు స్మశానానికి గ్రావెల్ తోలుచ్చని మహాప్రభువు అని వేడుకుంటే ఎప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితులు లేవు. జనసేన పార్టీ నుంచి ఒక్కటే తెలియజేస్తున్నా మీ ప్రభుత్వానికి, ఈ మంత్రికి ఇక నాలుగు నెలలే నాలుగు నెలల తర్వాత జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ప్రజా ప్రభుత్వంలో పరిష్కరించే దానికి అడుగులు ముందుకు వేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వైసిపి నాయకులకు ఒకటే చెబుతున్నా మీ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది మీకు 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో వీరమహిళ వాణి, భవాని, సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, కాకి శివకుమార్, రహీం, శరత్, సుధాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.