యల్లటూరుకు ఘనసన్మానం

  • రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజుగారిని కలిసి ఘనంగా సన్మానించిన నందలూరు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు.

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు ఎన్నికల సమన్యయకర్తగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించిన సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజుని కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన నందలూరు జనసేన నాయకులు, కార్యకర్తలు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన బలంగా ఉన్న ప్రతి పంచాయితీ మరియు బూత్ నందు పొత్తు ధర్మం పాటిస్తూ కూటమిలోని నాయకుల గెలుపుకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన నాయకులు ప్రశాంత్ భారతాల, పైడికొండ్ల సుబ్రమణ్యం, తిప్పాయపల్లి ప్రశాంత్, పైడికొండ్ల సునీల్ గౌడ్, భత్యాల వినయ్, పోలిపోగు శ్రీకాంత్, మిరియం నాని, కత్తి లక్ష్మణ్, పోకూరి జ్ఞానేశ్వర్, కార్తీక్, వంశీ, నరసింహ, పాల్గొన్నారు.