జనసేన పార్టీలో చేరిన చిత్రాడ వైసిపి నాయకులు!

పిఠాపురం: చిత్రాడ జనసేన నాయకులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబు సమక్షంలో వైసిపి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు 100 మంది పెద్దలు, యువకులు జనసేన పార్టీలో చేరారు. పిఠాపురం గోకులం గ్రాండ్ లో కొణిదెల నాగబాబు వీరికి పార్టీ కండువా వేసి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఎలక్షన్ కి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని యువతులకు పెద్దలకు తెలియజేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి భారీ స్థాయిలో జనసేనలో చేరికలు పెరిగిపోయాయన్నారు. ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయమని లక్ష ఓట్లు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటామని ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి నాయకులు జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుగుణంగా పని చేసి అధికారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయినింగ్ అయినా నాయకులు మాజీ ఎంపీటీసీ వెన్న రాంబాబు, పేర్నిడి పెద్ద, కోటిపల్లి మంగరాజు, మొగిలి దొరబాబు, బావిశెట్టి రాజు, కంద చక్రబాబు, బావిశెట్టి నాగబాబు, బస్వా కొండబాబు, శిగతాపు ప్రసాద్, మల్లె పాము తాతీలు, మరియు జనసైనికులు, నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.