ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం

ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులతో నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షతన రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ఎన్నికల నిర్వహణ కన్వీనర్ రాఘవయ్య చౌదరి, జనసేన నాయకులు నారా శేషు వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి వివిధ పార్టీల నుండి సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి రెడ్డి అప్పల నాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మీ, నారా శేషు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరికి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని దిశా నిర్దేశం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు. రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురవేయడం కోసం కావలసిన ప్రణాలికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈరోజున ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు ఆళ్ళనాని ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను మరోసారి మాయమాటలతో మోసం చేయడానికి జగన్ రెడ్డి ఆళ్ళనాని కుట్రలు పన్నుతున్నారు. ఐతే ఈసారి మోసపోవడానికి ఏలూరు జనం సిధ్ధంగా లేరనే విషయాన్ని గుర్తించాలని రెడ్డి అప్పల నాయుడు స్పష్టంగా తెలియజేశారు. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నాపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నాడు. ఈ ఆళ్ళనాని ఏలూరులో ఆళ్ళనాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేయని స్కాం ఏదైనా ఉందా అని తిరిగి ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఆసుపత్రికి వస్తే మంచానికి ఒక రేటు, ఆక్సిజన్ గాలికి ఒక రేటు, రెమిడీస్ వీర్ ఇంజక్షన్లు బ్లాక్ లో అమ్మకాలు, ప్రైవేట్ ఆసుపత్రిలోని లాభాల్లో మీకు వాటాలు, కొవ్వొత్తుల వెలుగులో మీరు చేయించిన ఆపరేషన్లు, ఇవి మీ ఘనతలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని, గవర్నమెంట్ హాస్పిటల్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో కోటాను కోట్లు లూటీ చేయించిన ఘనత మీది కాదా..? మీరు కూడా నన్ను విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు. దహన సంస్కారానికి వచ్చే వాళ్ళ కోసం ఫ్లాష్ సంస్థ వారు ఏర్పాటు చేసిన షెడ్ నీ కూల్చింది మీరు కాదా, ఎమ్మెల్యేగా మీరు వచ్చిన తరువాత వీధుల్లోని యువత గంజాయికి అలవాటు పడ్డారు. ఏలూరులో ఉపాధి కరువైంది. ఉన్న ఒక్క జూట్ మిల్లు పరిశ్రమ మూతపడ్డాయి. రోడ్ల మధ్యలో గుంతలు ఉన్నాయో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయో అర్థం కానీ పరిస్థితి. ఏలూరులో మేము జనసేన పార్టీ తరపున అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. శనివారపు పేటలోని దేవాంగుల పేటలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో మేము పోరాడి వేయించాము. వంగాయగూడెంలో డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్యపై పోరాటం చేశాము. ఫిలాస పేటలో అధ్వాన్నంగా ఉన్న రోడ్డు మీద ముందుగా మేము నిరశన చేస్తేనే మీలో చలనం వచ్చిందన్నారు. ఏలూరుకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. ఏలూరుకు వచ్చిన ఆదాయాన్ని ఏ రూపంలో ఖర్చు చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరులో మీది 30 సంవత్సరాల ప్రస్థానం. కానీ మీరు ఏలూరుకు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇప్పటికీ ఏలూరు ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి సిధ్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.