పుట్టపర్తి జనసేన ఆధ్వర్యంలో మూడవరోజు డిజిటల్ క్యాంపెయిన్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రోడ్ల దుస్థితి గురించి మొదలు పెట్టిన డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు పుట్టపర్తి పరిధిలోని బుక్కపట్నం మండలం కొత్తకోట రెవెన్యూ లోని నార్సింపల్లి తాండా మరియు నార్శింపల్లి గ్రామం ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రహదారుల సమస్య గురించి ఈ రోజు జనసేన పార్టీ తరుపున #GoodMorningCMSir కార్యక్రమం భాగంగా పాల్గొనడం జరిగింది.. ఈ గ్రామానికి రోడ్డు సమస్య గురించి మాట్లాడడం కోసం వెళ్తే ఆ ఊరి ప్రజలు ఇక్కడ మరి కొన్ని సమస్యలను కూడా జనసేన పార్టీకి వెల్లడించారు..మరీ ముఖ్యంగా ఇక్కడ మొబైల్ నెట్వర్క్ లేకపోవడం వలన ఎవరికైనా అత్యవసర విషయాన్ని బయటి వారికి చెప్పాలి అన్నా కానీ అంబులెన్స్ లకు కాల్ చెయ్యాలి అన్నా సరే ఊరి చివరికి వెళ్లి గుట్టో లేక చెట్టో ఎక్కి మరీ చెయ్యాల్సిన దుస్థితి నెలకొంది అని గ్రామ ప్రజలు వాపోయారు.. ఈ ప్రాంతాలకు రాత్రి పూట వెళ్ళడానికి దారులు కూడా సరిగ్గా లేకపోవడం మరో పెద్ద సమస్య. దారి మధ్యలో ఉన్న కల్వర్టు కూడా పోయిన సంవత్సరం వచ్చిన వరదల కారణంగా విరిగిపోవడం జరిగింది. తరువాత ఎమ్మెల్యే డుద్దుకుంట శ్రీదర్ రెడ్డి వచ్చి ఈ గ్రామానికి మూడు నెలల్లో వంతెనను నిర్మించి రాకపోకల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు, సంవత్సరం దాటిన రోడ్డు సమస్యను పరిష్కరించ లేదు.. దీనికి తాత్కాలిక పరిష్కారం కొరకు గ్రామ ప్రజలు మట్టి వేసుకొని చిన్న దారిని వేసి దాని మీదనే గ్రామాలకు వెళ్తున్నారు, అది కూడా కేవలం ద్విచక్ర వాహనాలు,లేదా ఆటోలు వెళ్ళడానికి మాత్రమే ఉంది. ఎమర్జెన్సీ టైం లో అంబులెన్స్ కూడా వెళ్ళడానికి దారి లేదు. దీనివల్ల గ్రామ ప్రజలు దాదాపు అయిదు కిలోమీటర్లు రావాల్సి వస్తుంది.. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా ఈ గ్రామానికి రహదారులు ఇంకా బాగు చేయకపోవడంతో వృద్దులు, మహిళలు, విద్యార్థులు మరియు రోజు కూలీలు అనేక ఇబ్బందులకు గురవతున్నారు… కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిద్ర లేచి వెంటనే రోడ్డు పనులు పూర్తి చెయ్యాలి అని పుట్టపర్తి జనసేన పార్టీ తరుపున కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, బోయ వంశీ,సాయి ప్రభ, మేకల పవన్ కళ్యాణ్, నాగరాజు, అభి, చిగిచర్ల గణేష్, హరి, నార్సింపల్లి గణేష్, మురళి, పవన్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.