గ్రేటర్ హైదరబాద్ విద్యార్థి విభాగం వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్

గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం కమిటీ ప్రకటించిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిధిగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ హాజరయ్యారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల,ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొని కమిటీ మెంబెర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన విద్యార్థి విభాగం చేపట్టబోయే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విద్యార్థి కమిటీ లు వేసి విద్యార్థి సమస్యలపై పోరాటం సాగింస్తుందని తెలియజేశారు.