ఉప్పల్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించి ఉప్పల్ నియోజకవర్గాన్ని తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలోనూ ముందుంచడానికి పనిచేసిన వాలంటీర్లకు చిరు సత్కారం చేసి గౌరవించడం జరిగింది. అనంతరం ఇంటిటి ప్రచారం కోసం కరపత్రాలను, స్టికర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల కోసం ఉప్పల్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సూచనలను, సలహాలను, అభిప్రాయాలను పంచుకున్న నియోజకవర్గ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు అందరికీ ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నిహారిక నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.