అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని ఆర్.డి.ఓ కి వినతిపత్రం ఇచ్చిన గుడివాడ జనసేన

గుడివాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం
గుడివాడ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో గుడివాడ ఆర్.డి.ఓ కి వినతిపత్రం ఇచ్చి వెంటనే అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయాలని జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది.

గుడివాడ నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అధికారపక్షం ఎమ్మెల్యే కొడాలి నాని ఆగడాలు అరికట్టాలని కోరడం జరిగింది.

గుడివాడ పట్టణంలో ఉదయం సమయంలో ఎటువంటి లారీలు కానీ ట్రాక్టర్ లు కానీ అనుమతులు లేవు,
కానీ ఉదయం 8 గంటల నుండి టిప్పర్లుతో మట్టి అధిక లోడుతో వాహనాలు వెళ్తున్నాయని.. వాటిని వెంటనే నిలుపుదల చేసి.. మట్టి తవ్వుతున్న వారిపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.

అలాగే బుడమేరు కాలువ అతి పెద్ద కాలువ వాటి నిబంధనలకు విరుద్ధంగా 150 నుంచి 200 ఎకరాలు చెరువులు ఎమ్మెల్యే నాని అనుచరులు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు.. వాటిని కూడా నిలుపుదల చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర రావు, మండల అధ్యక్షుడుఇంటూరి గజేంద్ర, వేమూరి త్రినాథ్, షేక్ మీరా షరీఫ్, జేమ్స్, మజ్జి శ్రీనివాసరావు, బుడమా రాజు, చింతా రామకృష్ణ, డి. రవి కుమార్, దుర్గా రావు, తదితరులు పాల్గొన్నారు.