గిరిజన సమస్యలను పరిష్కరించాలి: గుమ్మడి శ్రీరాం డిమాండ్

అనకాపల్లి జిల్లా, వి మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం గుంటు కొత్తూరు గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు గుమ్మడి శ్రీరాం గిరిజన ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. వైసీపీ గవర్నమెంట్ నుంచి గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపాధి లేదని ప్రజలు ఇబ్బందిలో ఉన్నారని, విద్యకి వైద్యానికి దూరంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడు ఎటువంటి సహాయం చేయడం లేదని, జగనన్న ఇళ్ళు ఇవ్వలేదని జగనన్న ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ గ్రామంలో తక్షణమే సిసి రోడ్లు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని, గిరిజన ప్రజలకు విద్య వైద్య సదుపాయాలను మెరుగు పరచాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.