గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది ??

  • శింగనమల నియోజకవర్గ టీడీపి జనసేన సమన్వయ కర్త సాకే మురళీకృష్ణ మరియు నియోజకవర్గ నాయకులు

శింగనమల నియోజకవర్గం: సింగనమల మండలం జనసేన- తెలుగు దేశం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. మండలంలో గుంతలు పడి అధ్వానంగా తయారై, ప్రమాదాలకు కారణం అవుతున్న రోడ్లను పరిశీలించారు. ఆంధ్ర ప్రదేశ్ కు దారేది సంయుక్త కార్యక్రమంలో భాగంగా సింగనమల మండల పరిధిలోని లోలూరు మదిరేపల్లి మరియు రేగడి కొత్తూరు, పోరాల్ల గ్రామ సమీపంలో గల రోడ్లు ప్రమాదకరంగా మారి గుంతలు పడిన రోడ్డు ని చూపిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగనమల జనసేన నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ చేతకాని పరిపాలనకు రాష్ట్రంలోని రహదారులే నిదర్శనమని ఇంచార్జ్ సాకే మురళీకృష్ణ, తోట ఓబులేసు మరియు జనసేన నాయకులు ప్రభుత్వం పై విమర్శలు చేసారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితి పై ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరిచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వర్, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర శేఖర్, డి జయమ్మ, శశిరేఖ, సింగణమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, ఉపాధ్యక్షులు సాయి శంకర్, మధుసేఖర్ జనసేన నాయకులు తోట రామమోహన్, భాస్కర్, కుల్లాయి, హరి, రాము మరియు జనసైనికులు, పెద్ద ఎత్తున జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.