బాబా ఖాదర్ వలీ 65వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న గురాన అయ్యలు

విజయనగరం, బాబామెట్టలో జరుగుతోన్న హాజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ 65వ మహా సూఫీ సుగంధ (ఉరుసు) మహోత్సవంలో జనసేన నేత గురాన అయ్యలు పాల్గొన్నారు. బుధవారం బాబామెట్టలో ఖాదర్ వలీ దర్గాకు చేరుకున్న గురాన అయ్యలుకి ఖలీల్ బాబు సాదర స్వాగతం పలికారు. ఖాదర్ బాబా దర్బార్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా బాబా ఉరుసు ఉత్సవంలో భక్తజనం పాల్గొనడం విశేషమన్నారు. ఎక్కడా, ఎన్నడూ జరగని విధంగా ఖాదర్ బాబా దర్గాలో నిత్యాన్నదాన క్రతువు జరగడం మహా అద్భుతమన్నారు. బాబా దయతో ప్రజలంతా సుఖః సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.