గ్వాలియర్-చంబల్ మద్య హై వే కు ‘శ్రీ అటల్ బీహారీ వాజ్‌పేయి చంబల్ ప్రోగ్రెస్ వే’ గా నామకరణం

భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వర్గస్తులయ్యి ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాలు కావస్తోంది అయితే ఈ సందర్భంగా మధ్యప్రదేశ్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్-చంబల్ మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ఆదివారం ప్రకటించారు. ఇప్పటి నుండి ఈ ఎక్స్‌ప్రెస్ వేను శ్రీ అటల్ బీహారీ వాజ్‌పేయి చంబల్ ప్రోగ్రెస్ వేగా వ్యవహరించనున్నట్లు చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. వారి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్‌పేయి స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు.