ఘనంగా అనంత నాయుడు జన్మదిన వేడుకలు

పెదకూరపాడు: అచ్చంపేట మండలం, చిగురుపాడు ఆర్ఎన్ఆర్ సెంటర్ నందు అర్ధరాత్రి 12 గంటలకు ఆయన అభిమానులు కేక్ కట్ చేసి బాణా సంచి కాల్చి సంబరం చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా అచ్చంపేట పార్టీ ఆఫీసు నందు మండల అధ్యక్షులు మట్టం వీరభద్రరావు నిర్వహించిన జండా వందన కార్యక్రమంలో పాల్గొని అనంతరం మండల ఉపాధ్యక్షులు మన్యం జనార్దన్ రావు ఏర్పాటుచేసిన కేక్ కటింగ్లో పాల్గొన్నారు. తనంతరం అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం నందు మండల కార్యదర్శి కంబాల రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు కన్నా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. మాదిపాడు కార్యక్రమంలో మాదిపాడు గ్రామ జనసేన పార్టీ కమిటీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రంశెట్టి రామకృష్ణ, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ శాఖమూరి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు మట్టం వీరభద్రరావు, మండల ఉపాధ్యక్షులు మన్యం జనార్ధన్ రావు, పోలశెట్టి చెంచయ్య, అచ్చంపేట టౌన్ ప్రెసిడెంట్ నీలం ప్రసాద్ మండల కార్యదర్శిలు కంబాల రాంబాబు కందుల గణేష్ పూల నాగరాజు సత్యనారాయణ శివ అచ్చంపేట మండల వివిధ గ్రామాల గ్రామ ప్రెసిడెంట్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.