జగన్ రెడ్డి మీరు ధర్మం వైపా – ధర్మారెడ్డి వైపా?

  • మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్టు.. జగన్ రెడ్డి గుట్టు ధర్మారెడ్డి దగ్గర ఉందా?
  • ధర్మారెడ్డి కి 10 లోపు గడువు.
  • 10న అలిపిరిని ముట్టడిస్తాం.
  • జనసేనానిని, జనం సీఎంగా కోరుకుంటున్నారు.
  • రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు.
  • భాజపాలో 90% పవన్ అభిమానులే.

తిరుపతి, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధర్మంగా పాతుకుపోయి టీటీడీ ని శాసిస్తున్న ధర్మారెడ్డి ఆయన కుమారుని నిశ్చితార్థం.. 10వ తేదీ లోపు ధర్మంగా పదవి నుండి తొలగి పోవాలని లేనిపక్షంలో ఈనెల 10వ తేదీ అలిపిరి వద్ద భారీ ఎత్తున రాస్తారోకో ముట్టడి కార్యక్రమాన్ని తల పెట్టామని.. తమతో పాటు టిడిపి, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా కలుపుకుని పోరాడుతామని జనసేన పార్టీ నేతలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి మరియు బాబ్జీ, రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ బాబు, మునస్వామి, పార్డు, బలరామ్, మనోజ్, కిషోర్, సుమన్ లోకేష్ తదితరులతో కలిసి ఓ ప్రైవేట్ హోటల్ లో వారు మాట్లాడుతూ… ధర్మన్న నీకిది న్యాయమా ? చట్టాన్ని అతిక్రమించి కొనసాగుతున్న నీ పదవీకాలం వెనక రహస్యం వైసిపినా లేక కనబడని శక్తులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, అవినీతి చక్రవర్తి శేఖర్ రెడ్డి కుమార్తెని కుమారునితో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 9వ తేదీ జరగనున్న నిశ్చితార్థం సమయం వరకు గడువు ఇస్తున్నామని 10వ తేదీ నీ భరతం పడతామని హెచ్చరించారు. బీజేపీతో పొత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వీరు భారీగా స్పందించారు తాము గల్లీ నాయకులై ఉండొచ్చు కానీ మా జనసేనాని జనాభిమానం కలిగిన నేతని అభివర్ణించారు, బిజెపిలో సీఎం స్థాయి అభ్యర్థి ఉంటే పేరు ప్రకటించాలని కోరారు, రాజకీయ పరిస్థితులను బట్టి మా నాయకుడు తెలిపిన మూడు ఆప్షన్స్ లే చివరి నిర్ణయం అని అన్నారు. ఏది ఏమైనా 2024లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నే అని ఆశాభావం వ్యక్తం చేశారు.