పుట్టినరోజు శుభాకాంక్షలు అనుష్క

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అనుష్క అదేనండీ తీయటి మనసున్న మన స్వీటీ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటుంది. అనుష్క ‘సూపర్’ సినిమాతో వెండితెరకు పరిచయమై కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలు చేస్తూ.. నెమ్మదిగా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనుష్కను మరోస్థాయిలో నిలబెట్టాయి. వేదం, విక్రమార్కుడు, ఖలేజా, సింగం, మిర్చి, బాహుబలి లాంటి సినిమాల్లో ఆమె నటవిశ్వరూపం కనిపిస్తుంది. తకిట తకిట, సోగ్గాడే చిన్నినాయనా, శకుని, ఊపిరి, సైరా లాంటి సినిమాల్లోనూ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది స్వీటీ.. స్టాలిన్, కేడి, కింగ్ లాంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. స్వీటీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు అనుష్క.