జె.పి.నడ్డాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాల భారతావనిని పరిపాలిస్తున్న జాతీయ రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్నారంటే మీ శక్తియుక్తులు, రాజకీయ పటిమ, దీక్షాదక్షతలు ఎంతటివో అవగతమవుతుంది. మూడు పదుల ప్రాయంలోనే చట్టసభకు ఎన్నిక కావడం మీలోని రాజకీయ జిజ్ఞాసకు నిదర్శనం. న్యాయవాదిగా, మంత్రిగా, రాజకీయవేత్తగా మీరు సాధించిన విజయాలు నేటి తరానికి ఆదర్శప్రాయం. మీ కీర్తి ప్రతిష్టలు అజరామరంగా వెలుగొందాలని, మీకు సుసంపన్నమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.