నాదెండ్ల మనోహర్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సహనం, సౌశీల్యం కలిగిన శ్రీ మనోహర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభాపతిగా సభను నడిపిన విధానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ఎంతో నేర్పుగా నిర్వర్తిస్తున్నారు. పార్టీలోని క్షేత్ర స్థాయి జన సైనికులు, వీర మహిళల నుంచి నాయకుల వరకూ అందరినీ సమన్వయం చేస్తూ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన అనుభవం ఎంతో దోహదపడుతోంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సుఖసంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.