ఘనంగా నేరెళ్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు

శనివారం జరిగిన గుంటూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ గారు పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు వారి అభిమానులు సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు పాల్గొని నేరెళ్ల సురేష్ కి పూలమాలలతో శాలువా కప్పి పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేరెళ్ల సురేష్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు జనసేన పార్టీ గురించి పలు సూచనలు ఇచ్చి రానున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు.