పెదపూడి విజయ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం
విజయ్ కుమార్ కు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విజయ్ కుమార్” అనేది ఆరు అక్షరాలా పేరు మాత్రమే కాదు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం కూడా, బహుశా ఒక వ్యక్తిని పలకరించాలంటే విజయ్ కుమార్ గారిని చూసి నేర్చుకోవచ్చు, చెరగని చిరునవ్వు, తరగని ప్రేమ, అరగని మంచితనం, పెరగని గర్వం, విడవని స్నేహం, కరగని ధైర్యం, వదలని జ్ఞానం, చెప్పలేని అబద్ధం, దాసలేని నిజం, కొలమానం లేని అభిమానం, పలకరింపులో పరిజ్ఞానం, అజ్ఞానుల సైతం విజ్ఞానులను చేసి పరిజ్ఞానం వైపు పరుగులు తీయించగల సత్తా ఉన్న సమర్ధుడు విజయ్ కుమార్ గారు, హంగు ఆర్బాటాలు నచ్చవు, సామాన్య మానవుడి స్థితిగతులను ఇష్టపడేటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక వ్యక్తిగా మొదలై శక్తిగా తయారవుతూ, వ్యవస్థగా మారబోతున్నాడు, హోదా వచ్చినా గర్వం రాదు, బాధ వచ్చిన బయటికి రాదు, పొగడ్తలకు పొంగడు, విమర్శలకు కుంగడు, చేసే పనిలో నీతి నిజాయితీ ఖచ్చితంగా ఉండాలని పరితపించే పరిజ్ఞానుడు, కష్టాన్ని ఇష్టపడతాడు, సుఖాన్ని దూరం పెడతాడు, తప్పులను ఖండిస్తాడు, ఒప్పులను ప్రోత్సహిస్తాడు, మంచికి ముందుంటాడు, చెడుకు వెనుక ఉంటాడు, ప్రేమని పదిమందికి పంచుతాడు, ద్వేషాన్ని తనలో తానే ఉంచుకుంటాడు, పదిమందిలో ఒకడులాగా ఉండడు, పదిమందికి ఒకడులాగే ఉంటాడు, పేరుకు ప్రాధాన్యత ఇవ్వడూ, పనికి ప్రాధాన్యత ఇస్తాడు, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ గారికి నచ్చి ఉంటాడు, సమాజానికి స్నేహితుడుగా జీవిస్తున్న, గొప్ప మంచి మనసున్న, గొప్ప వ్యక్తిత్వం ఉన్న, గొప్ప జ్ఞానం ఉన్న, మన అందరివాడు “విజయ్ కుమార్” గారు, అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలిపారు.