రవి కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం: జీలుగుమిల్లిలో అందరికి సూపరిచితులు, కష్టాల్లో ఉన్నవారికి ఆశాదీపం, ఎందరికో మార్గదర్శకులు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్ జన్మదినం సందర్భంగా పోలవరం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాల రాజు మరియు జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు, మండల కమిటీ నాయకులు వారి స్వగృహమునందు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో చిర్రి రాంపండు గుండుమొగుల సత్యనారాయణ, మెట్ట బుచ్చిరాజు, సింగంశెట్టి మనోహర్, వంకా శ్యామ్, కాకా లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.