జనసేన అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు

  • పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు నిత్యవసర సరుకుల పంపిణీ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బైంసాలోని వివేకానంద అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పండ్లు అదేవిధంగా నిత్యవసర సరుకులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు జనసేన యువకులు చంద్ర విశాల్ చంద్ర సచిన్ గణేష్ గిరి యోగేష్ మనోహర్ నవీన్ రమేష్, అదేవిధంగా ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్, జాంబులేకర్ సురేష్, కళాకారుల నిర్మల్ జిల్లా అధ్యక్షులు కొత్తూరు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఎదగాలని సినిమాల పరంగా మరెన్నో సినిమాలు తీస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని తెలిపారు. చంద్రే విశాల్ మాట్లాడుతూ పవన్ చేసే పనులు అదేవిధంగా ఈ తరంలో మాకు భగత్ సింగ్ లాగా అనిపిస్తుంది అని అందుకే యువకుల్లో అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో చీకటి నుండి వెళ్తురు నింపే సూర్యుడులా కనిపించాడని అందుకే మేమంతా పవన్ కళ్యాణ్ కి అభిమానులుగా మారి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం.అని తెలిపారు. వాడెక్కర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తూరు శంకర్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ప్రజలలో పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు తీసుకెళ్తూ ప్రజలకు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తామని పిలుపునిచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.