ఘనంగా తిప్పన దుర్యోధన రెడ్డి పుట్టినరోజు వేడుకలు

  • దుర్యోధన రెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణ

ఇచ్చాపురం: జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధి ,బెన్నిగాని పేట గ్రామంలో మరియు మున్సిపాలిటీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. కార్యక్రమాలలో ముందుగా తిప్పన చందు రెడ్డి ఆధ్వర్యంలో బెన్నిగాని పేట గ్రామ జనసైనికుల సహాయంతో భవన నిర్మాణ కార్మికులకు సేఫ్టీ హెల్మెట్ మరియు సేఫ్టీ షూస్ 30 మందికి పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మున్సిపాలిటీలో కార్మికులకి 60 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 22 మంది రక్తదానం చేయడం జరిగింది. మరియు కేశ్వరం పంచాయతీ నేలపుట్టి గ్రామంలో 100 మందికి పైగా కిడ్నీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు తిప్పన దుర్యోధన రెడ్డి నిర్వహించగా.. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ నాయకులు దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ఇసుకలపాలెం సర్పంచ్ బైపల్లి ఈశ్వర్, మత్స్యకార విభాగ కార్యదర్శి హరి బెహెర, మున్సిపాలిటీ వార్డ్ ఇంచార్జులు, సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేసిన అభ్యర్థులు మరియు ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.