పవన్ కళ్యాణ్ మాటలు పెడచెవిని పెట్టాం.. ఫలితం అనుభవిస్తున్నాం: సంగిశెట్టి అశోక్

  • దుమ్ములు పేటలో వైకాపా పాలనను దుమ్ము దులిపేసిన మహిళలు

కాకినాడ: మేలు చేస్తారని అధికారం అప్పజెప్పితే ఓట్లేసిన అమాయక మత్స్యకారుల జీవితాలు బుగ్గిపాలు చేశారని, దుమ్ములు పేట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్దానిక పదవ డివిజన్ దుమ్మలు పేట జనసేన నాయకులు దాసరి వీరబాబు ఆధ్వర్యంలో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమానికి సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా స్దానిక ప్రజల యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు. పి.ఎ.సి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకోవదానికి వచ్చానని తెలిపారు. ఎక్కవ మంది మత్స్యకారులు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో అభివృద్ధి కేవలం అధికార పార్టీ నాయకుల మనుషులకే జరిగిందని, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి ఓకే కుటుంబంలో నాలుగు, ఐదు ఇళ్ళ స్థలాల సంపాదించుకున్నారు అని, సామాన్యులు మాత్రం ఓకే ఇంటిలో మూడు, నాలుగు కుటుంబాలు కాపురాలు చేస్తూ మగ్గిపోతున్న విషయాన్ని తమ నాయకులు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్, ముత్తా శశిధర్ కు నివేదించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు సేవ చేస్తారని జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సచివాలయం వ్యవస్థ నేడు అబాసు పాలవుతుందని, సచివాలయంలో పనిచేసే వాలీంటిర్ల ఆగడాలు హద్దులు మీరి ప్రజలను పన్నులు కట్టక పోతే ఇళ్ళపై పడి బెదిరింపులకు పాల్పడుతున్న వైనం దుమ్ముల పేటలో వెలుగు చూస్తుందని తెలిపారు. గంజాయి, మద్యం అమ్మకాలు జరుగుతున్నా పోర్టు పోలీసులు పట్టించు కోవడం లేదని మహిళలు తమకు తెలిపారని చెప్పారు. పాతిక కేజీల బియ్యం కావాలా పాతిక సంవత్సరాల అభివృద్ధి కావాలా అని 2019 లో పవన్ కళ్యాణ్ మాటలు పెడచెవిని పెట్టాం కాబట్టి ఈ సారైనా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, సింహాద్రి, కోటేశ్వర రావు, సూరిబాబు, దాసు, దనారాజు, ప్రసాద్, కృష్ణ, తదితరులున్నారు.