మహిళలందరికి వీరమహిళా దినోత్సవ శుభాకాంక్షలు

తెల్ల దొరల అధికారాన్ని, అహంకారాన్ని ధిక్కరించిన “వీర మహిళ” ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తి కొనసాగాలి, ఆమె నేర్పిన పోరాటతత్వంఎప్పటికీ మనకి ఆచరణీయం.
జనసేన వీరమహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరిగింది. కావున అదే స్ఫూర్తితో అంతే పోరాటంతో ఎంతో ధైర్యంగా ఎటువంటి మస్యనైనా ఎదుర్కొనే విధంగా జనసేన పార్టీ వీరమహిళలు సమాజంలో మహిళా సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మన వీరమహిళలు అనేక పోరాటాలు చేశారు. సమస్యపై తనదైన శైలిలో స్పందిస్తూ, మగవాళ్ళతో తాము ఏమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు మన వీరమహిళలు.
ప్రతి ప్రభుత్వం మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని, రక్షణ కల్పించాలని చట్టాలు చేస్తూనే ఉన్నాయి. కానీ వాటిని నిలబెట్టుకోవడం అందరి బాధ్యతగా మారాలి. మహిళలు నిజాయితీగా వాస్తవాలు చెబుతారని శ్రీ పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకే వారు చేసే సూచనలను జాగ్రత్తగా వింటారు. చాలా పార్టీలు వారి మీటింగులకు కష్టపడి మహిళలను తీసుకొచ్చి ముందు వరసలో కూర్చొబెడతారు. జనసేన పార్టీకి ఆ అవసరం లేదు.

కొవ్వొత్తిలా తాను కరిగిపోయినా కూడా తన మీద అధారపడిన ప్రజల మనసుల్లో జ్యోతులు ప్రసరింపజేసిన ఓ గొప్ప వజ్రపుతునక. నేటి తరం మహిళలకు ఓ గొప్ప రోల్‌మోడల్‌. 1828 నవంబరు 19న మహారాష్ట్రలోని వారణాసి పట్టణంలోని సతరాలో మోరోసంత్‌తాంబె, భగీరథీబాయి ఆదర్శదంపతులు ఇంట భారతమాత ముద్దుబిడ్డగా జన్మించింది. ఆమె అసలుపేరు మణికర్ణిక. తండ్రి ప్రేమగా మను అని పిలిచుకొనేవారు. మణికర్ణిక 4సంవత్స్రాల వయస్సులో తల్లి చనిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో వీరి దూరపు బంధువు వీరిద్దరికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారు. చిన్నతనం నుండి రకరకాల విద్యలమీద ఆశక్తి కనబరిచేది. దానితో తండ్రి కత్తి సాము, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం లాంటి విద్యలన్నింటిని నేర్పించాడు. ఆమెకు 13 ఏళ్లకే ఝూన్సీ పట్టణానికి చెందిన, గంగధరరావు నెవల్కశతో 1842లో వివాహం జరిగింది. తరువాత ఝాన్సీలక్ష్మిబాయిగా మారిపోయింది. వీరికి కుమారుడు పుట్టి చనిపోవడంతో దామోదరరావును దత్తత తీసుకున్నారు. కొద్దిరోజులకే గంగాధరరావు చనిపోయారు. దీనితో లక్ష్మిబాయి బాధల్ని దిగమింగుకొని విలువిద్యల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆ విద్యలన్ని తన సన్నిహితులకి నేర్పించి పటిష్టమైన స్త్రీ, పురుష దళాల్ని తయారు చేసింది. కొడుకు రాజవ్వాలని కోర్టులో దావావేసింది. కాని కోర్టు కేసుకొట్టివేసింది. లక్ష్మిబాయి కోర్టుకు వెళ్లిందనే కక్షతో బ్రిటిష్‌వారు ఆమె ఆస్తులన్నీ స్వాధీన పరచుకున్నారు. అంతే కాకుండా ఆమెను ఝాన్సీ విడిచివెళ్లమని ఆదేశాలు జారీచేశారు. ఆమె తన ప్రజలకోసం భారతభూమి కోసం బ్రిటీష్‌ వారి సుంకలాల నుంచి భారతమాతను రక్షించడంకోసం ఝాన్సీని విడిచి వెళ్లేదీలేదని వారితో యుద్ధానికి సిద్ధపడింది. ఆమె తన బలగాలను చుట్టు ఏర్పచుకొని బిట్రిష్‌వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఈ వీరనారికి సహాయంగా తాంతొమతో 20000ల మంది సైన్యంతో వచ్చి యుద్ధానికి తలపడ్డాడు. కాని బ్రిటిష్ సైన్యం ముందు లక్ష్మీ బాయి బలగాలు బలహీనమవ్వడంతో నగరాన్ని చేజిక్కించుకున్నారు. బ్రిటిష్‌వారు కోటగోడలను బద్దలుకొట్టి నగరాన్ని చేజిక్కించుకున్నారు. కాని రాణిఝాన్సీ దత్తపుత్రుణ్ణి వీపునకు కట్టుకొని గుర్రపుస్వారీ చేస్తూ గ్వాలియర్‌ చేరుకొని అక్కడ అపార చండిలా గ్వాలియర్‌ మహారాజుతో యుద్ధం చేసి గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకొంది. ఈ సంతోషంలో ఉండగానే మళ్లీ బ్రిటీష్‌వారు వచ్చి గ్వాలియర్‌ను ముట్టడించారు. లక్ష్మీబాయి వారితో కాళీమాతలా తలపడి యుద్ధం చేసింది. కాని 17, జూన్‌ 1858న యుద్ధంలో వీరమరణం పొందింది. ఇలా అతి చిన్న వయసులో తన బుద్ధికుశలతతో వీరసాహసంతో ఆంగ్లేయుల పాలిట సింహస్వప్పమై జాతికి వన్నెతెచ్చింది. భారతదేశ రక్షణకోసం తన జీవితాన్ని బలిదానం చేసి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన పవిత్రమూర్తి భారతరత్నం ఝాన్సీరాణి లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశం గాఢ అంధకారంలో ఉన్నప్పుడు ఒక మెరుపులా ప్రకాశించి మాయమైన వీర వనిత. ధైర్య సాహసాలు, సంఘటనా కౌశలం, దేశ భక్తిని ప్రదర్శించి అమరురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి కోట్లాది భారతీయుల హృదయాలలో నిత్యమూ ప్రేరణా జ్యోతులను వెలిగించే అమర జ్యోతి… మహిళలందరికి వీరమహిళా దినోత్సవ శుభాకాంక్షలు.