బండి సంజయ్‌కు హరీశ్‌రావు సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. ‘నిధుల్లో వాటాపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. దుబ్బాక వస్తారా? కరీంనగర్‌కు రమ్మంటారా? అంటూ సంజయ్‌ను మంత్రి నేరుగా ప్రశ్నించారు. సిద్ధిపేటలో డబ్బుతో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.