1500 కోట్ల రూపాయల నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలకేమైనా మళ్ళించుకున్నారా?

సర్వేపల్లి, ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో తానోస్ రెడ్డి పరిపాలన కులాలను రెచ్చగొట్టే విధంగా జరుగుతుంది అని ప్రస్తావించారు . ఈనెల 31 వ తారీకు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మెడలు వంచి మరుగును పడి ఉన్న కాపు రిజర్వేషన్ ఏమైనా ఇప్పిస్తారా అదేవిధంగా కాపు కార్పొరేషన్ కి కేటా ఇచ్చిన 2000 కోట్ల నిధులకు సంబంధించి శ్వేత పత్రాన్ని ఏమైనా విడుదల చేసేదానికి సమావేశం అవుతున్నారా అనే విషయాన్ని స్పష్టత ఇవ్వాలి అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తానోస్ రెడ్డి కాపులని అడ్డగోలుగా మోసం చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే గతంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాడు ఉద్యమాన్ని అణగదొక్కాలని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది దానిని మేము ఆ విషయాన్ని మేము ఎప్పుడో ఖండించాం. అయితే ఆనాడు రైలుకి నిప్పు అంటించిన దోషులని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. మరి ఎందుకు కేసును మాత్రం ఎంతో తెలివిగా కొట్టేసింది అంటే దోషులను పట్టుకోవడం మీకు చేతకాక లేదంటే రైలుకు నిప్పంటించింది మీరేనా అనే అనుమానం కాపుల్లో నాన్తుంది. విషయాన్ని మాకు స్పష్టత ఇవ్వాలని వైసిపి కాపు నాయకులందరిని మేము అడుగుతున్నాం అదేవిధంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాపు కార్పొరేషన్ లో మిగిలి ఉన్న 1500 కోట్ల రూపాయల నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలకేమైనా మళ్ళించుకున్నారా ఈ విషయాన్ని స్పష్టత ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరు ఎన్ని ఎతుగడ్డలు వేసిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కూడా మీరు అడ్డుకోలేరు ఆపలేరు మీకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, వెంకటేష్, శివ, రవి ,కాజా, బిక్కీ దయాకర్, రామిరెడ్డి, చెంచయ్య, మల్లి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.