యువత వలసల వలన రాష్ట్రంలో వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయి

మదనపల్లె, మెరుగైన ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలు దేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో వయస్సు మల్లిన వారే ఎక్కువగా ఉన్నారు మరో రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధుల రాష్ట్రంగా ఆంధ్ర అయి పోతుంది. రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఇదే జరగబోతుందని అర్థమవుతుంది. మంచి స్కూలు మంచి ఆసుపత్రిలో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఐటీ లేకపోవడంతో మెరుగైన ఉపాధి జీవనం కోసం యువత ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి పోతున్నారు స్థిరపడుతున్నారు దీని వల్ల రాష్ట్రంలో పిల్లల జనాభా క్రమంగా తగ్గుతున్నది. యువత తగ్గిపోయి పెద్ద తరమే ఇక్కడ మిగిలితే ఉత్పాదకత తగ్గిపోతుంది సంపాదించే వాళ్ళు లేక డబ్బు చలామణి లేక ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉంది. పల్లెటూర్లలో ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి పరిశ్రమని పెట్టుబడిని ఆకర్షించి మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కొనుగోలు శక్తి ఉంటుంది నగదు చలామణీలోకి వస్తుంది మరింత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.