మైనార్టీల మధ్య అసమానతలు పెంచడానికి ఈ పథకాన్ని పెట్టారా..?

  • జనసేన మైనార్టీ షేక్ కరీముల్లా బాబా విమర్శ

అంబేద్కర్ కోనసీమ, అమలాపురం, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన షాదీతోఫా పథకం అమలులో చిత్తశుద్ధి లేదని జనసేన పార్టీ అమలాపురం ముస్లిం మైనార్టీ షేక్ కరీముల్లా బాబా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లీంలలో వైఎస్ఆర్సీపి పట్ల వ్యతిరేకత లేకుండా చేసుకుని, తమకు సానుకూలంగా మార్చుకోవాలనే వ్యూహాత్మకంగా షాదీతోఫా పథకాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాన్ని పొందేందుకు 10వ తరగతి విద్యార్హతలు పేర్కొనడంతో అనేక మంది పేదవారు ఈ పథకం ఫలితాలను పొందలేని విచిత్ర పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒకే అమ్మాయికి వర్తిస్తుందనటం సరైంది కాదని, మైనార్టీలలో అసమానతలు పెంచేందుకే ఈ పథకాన్ని తీసుకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఆరంభ శూరత్వంగా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దికాలానికే నిలిపివేసి, ప్రస్తుతం అంతే తొందరగా ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏమిటి.? గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన పనులే చెప్పుకోవడమే తప్ప ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదని జనసేన పార్టీ అమలాపురం ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా బాబా తీవ్రంగా విమర్శించారు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం జగన్ చేస్తున్న నిర్వాహకమే తప్ప రాష్ట్రంలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు దుళన్ పథకంపై ముస్లిం మైనారిటీలలో పెల్లుబికిన అసంతృప్తిని గమనించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా షాది తోఫా ప్రకటించిందని అమలు కానీ ఎన్నో నిబంధనలను పెట్టి కిరికిరి చేస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇకనైనా వైసీపీ మైనారిటీ నాయకులు అమలు కానీ నిబంధనలను ఎత్తివేసి ప్రతి పేద ముస్లింలకు షాది తోఫా అందేలాగా చర్యలు చేపట్టాలని ఆయన హితవుపలికారు.