చిత్తూరులో మళ్లీ భారీ వర్షాలు

నివర్ తుపానుతో అతలాకుతం అయిన చిత్తూరు జిల్లాలో మరోసారి తుపాను ప్రభావం మొదలైంది. గత అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వరుస తుఫాన్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, గంగాధర్ నెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. నివర్ తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు నిండు కుండలా మారాయి. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.