హలో ఏపీ.. బై బై వైసీపీ: తిరుపతి జనసేన

  • అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి..
  • అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి..
  • జనం బాగుండాలి అంటే – జగన్ పోవాలి..

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అమలాపురంలో జన శ్రేణులకు “అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలి అంటే – జగన్ పోవాలి, “హలో ఏపీ బై బై వైసీపీ” ఇదే మన ఎలక్షన్ నినాదం అంటూ పిలుపునివ్వగా శుక్రవారం తిరుపతి టీవీఎస్ సర్కిల్ కూడలి నందు జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు ఆకేపాటి సుభాషిని, కొండ రాజమోహన్, ఆనంద్, హేమ కుమార్, లక్ష్మీ, చందన, దుర్గ, రాజేష్ ఆచారి, బలరాం, పార్ధు, గుట్టా నాగరాజు, మనోజ్, సాయి దేవ్, హేమంత్, పురుషోత్తం, వినోద్, బాలాజీ, హిమవంత్, సాయి కుమార్, కోమల్, రాజు, కిరణ్, ఆది కేశవులు, గోపి, భాను, రమేష్, మోహన, అతిధులతో కలిసి ప్లకార్డులను ప్రదర్శించారు.. ఈ సంద్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలంటే ఈసారి ఏ ఒక్క అవినీతి మచ్చలేని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మా అధ్యక్షులు చెప్పినట్లు నాయకుడిపై అవినీతి అక్రమాలు లేనట్లయితే ప్రజాస్వామ్యం కూడా సుభిక్షంగా కొనసాగుతుందని, సామరస్యంగా నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమని, ఇలాంటి కేసులకు ఒత్తిళ్లకు బెదిరింపులకు భయపడేది లేదని, రాబోయే జనసేన ప్రభుత్వంలో అన్ని మంచి రోజులేనని మీ దౌర్జన్యాలకు, బెదిరింపులకు కచ్చితంగా జవాబు చెప్పడం జరుగుతుందని వారు వ్యక్తం చేశారు.