జనంలోకి జనసేన కార్యక్రమం భాగంగా పేద కుటుంబానికి సహాయం

కందుకూరు, జనంలోకి జనసేన జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకల్ల శ్రీనివాసులు పిలుపు మేరకు మండల కేంద్రమైన గుడ్లూరు బిసి కాలనీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నంగి చలపతి, మండల జనసేన సీనియర్‌ నాయకులు ములగిరి. శ్రీనివాసులు, రమేష్, డానియేలు, అమ్మిశెట్టి మాధవ, ఆళ్ళ శివబాస్కర్ మరియు ఉలవపాడు మండల జనసేన నాయకులు ఆలూరి ప్రతాప్, కేశవరపు లక్ష్మణ్ పాల్గొన్నారు. అన్నంగి చలపతి మాట్లాడుతూ గుడ్లూరు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ పారిశుద్య వ్యవస్థ దారుణంగా ఉందని, 2019 ఎన్నికలలో తనను గెలిపించమని . స్థానిక ఎమ్మెల్యే ఈ కాలనీలో పర్యటించినప్పుడు జనసేన తరుపున సమస్యలపై ప్రశ్నించటం జరిగిందని చలపతి అన్నారు. గెలిచి నాలుగు సంవత్సరాలు అయినా మంచినీటి సమస్య డిజైన్, సమస్య పరిస్కారం కాకపోగా గడప గడపకు తిరుగుతూ సంక్షేమ అని అంటూ ఉంటే . హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగ . పేద కుటంబం అయిన కళ్లుగుంట చంద్ర మరవనమ్ము ఆరోగ్యం సరిలేక ఉపాధి లేక ప్రభుత్వం నుండి భరోసా లేక జీవిస్తున్న ఈ కుటంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. ఈ కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు, వెయ్యి రూపాయలు కందుకూరు నియోజకవర్గ నాయకులు ఇనకల్ల శ్రీనివాసులు సహకారంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవటం జరిగిందని మాలగిరి శ్రీనివాసులు అన్నారు.