సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలుపొందాల్ససిన సమయం ఆసన్నమైంది: దారం అనిత

ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన, ఆయన మంత్రులు తరచూ తెచ్చే గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం అర్థం రాష్ట్రాన్ని శాశ్వతంగా కులమతాల పునరేకీకరణ లోకి చేయడమే.. ఏళ్ళ తరబడి వస్తున్న భిన్నత్వంలో ఏకత్వం ధ్వంసం చేయడమే వీరి విధానం విపక్ష నేతల పైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తప్పుడు కారణాలతో జైలల్లో పెడుతోంది. ప్రజాస్వామ్య అన్ని వ్యవస్థల స్వతంత్రత దెబ్బ తీస్తున్నారు. చరిత్ర మొత్తం మార్చే ప్రయత్నం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులను తక్కువ చేసి చూపే ప్రయత్నం నిరంతరంగా సాగుతోంది.

రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం అన్న మూల సూత్రాలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దళిత, ఆదివాసి మహిళలతో పాటు దేశవ్యాప్తంగా బలహీన వర్గాల పై నిరంతరం దాడులు జరుగుతున్నా.. ఈ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. అడ్మినిస్ట్రేటివ్, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజం, మీడియాను భయపెట్టి గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మన రాజ్యాంగంలో నిక్షిప్తమైన ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రభుత్వం రగిలిస్తున్న విభేదాలు ప్రజలు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వస్తుంది ఇది మన ఊహకందని తీవ్రమైన సామాజిక విపరిణామాలకు దారితీస్తోంది.

అత్యధిక మంది ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలి అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలు మాత్రం ప్రజల విద్వేషాలు మధ్య పోట్లాడు కోవాలని కోరుకుంటూ నిరంతరం ఉన్నాయి. సమాజాన్ని విషతుల్యంగా మార్చే ఈ వైరస్ కు వ్యతిరేకంగా మనం గట్టిగా పోరాడాలి.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుస్థిర ఆర్థిక వృద్ధి అవసరం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే మనం ఆదాయం పెంచుకోవాలి. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పరిస్థితులు ఆర్థిక వృద్ధి దెబ్బతీస్తున్నాయి. వంట గ్యాస్, వంట నూనె తిండిగింజలు, పండ్లు కూరగాయలు, ఎరువులు, పెట్రో ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరిగిపోతూ కోట్ల కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడు పగతో ప్రైవేటీకరణ ఛేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ల ఉద్యోగాల కల్పనకు ఉన్న అవసరం పూర్తిగా మూసుకుపోతుంది. పరిశీలిస్తే క్షేత్రస్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం జనసేన పార్టీ లోని ప్రతి ఒక్కరి మీద ఉంది. వ్యక్తి గత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు పార్టీ అందరికీ అవకాశం ఇచ్చింది. ఆ రుణం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఆత్మవిశ్వాసం శక్తి, ఉత్సాహకరమైన ప్రేరణతో ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందిగా జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత కోరారు.